చండ్రుగొండలో వైద్యుడి కుర్చీ ఖాళీ
BDK: మండల కేంద్రమైన చండ్రుగొండలో హోమియో వైద్యశాలలో గత కొన్ని నెలలుగా వైద్యుడి కూర్చి ఖాళీగా ఉంది. గతంలో పనిచేసిన డాక్టర్ బదిలీపై వెళ్లిన అనంతరం నూతన వైద్యుడి నియామకం జరగలేదు. దీంతో రోగులు నిరాశతో వెను తిరుగుతున్నారు. తక్షణమే మరో డాక్టర్‌ను నియమించాలని మండల ప్రజలు కోరుతున్నారు.