అభివృద్ధికి కృషి చేస్తున్నాం: ఎమ్మెల్యే

RR: షాద్‌నగర్ నియోజకవర్గంలో ఆయా రోడ్ల పనుల కోసం రూ.2.20 కోట్ల నిధులు, పట్టణంలో పార్కులకు రూ.4 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. షాద్‌నగర్‌లో ఆయన మాట్లాడుతూ.. ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తించి పూర్తిస్థాయిలో అభివృద్ధికి కృషి చేస్తున్నామని, నియోజకవర్గ అభివృద్దే తన లక్ష్యమని తెలిపారు.