దమ్మపేటలో ఘనంగా రథసప్తమి వేడుకలు
BDK: దమ్మపేట సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సామూహిక పూజలు చేశారు. సూర్య అష్టకం పఠించి పాలు పొంగించి సూర్యుడికి నైవేద్యం సమర్పించారు. అర్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు నిర్వహించారు.