BRS పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన హరీష్ రావు

SDPT: సిద్దిపేట పట్టణంలోని 20వ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే హరీష్ రావు ఆదివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. కేసిఆర్ నాయకత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరిగిందన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన ఘనత తమదేనన్నారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల్లో అసంతృప్తి నెలకొందనీ పేర్కొన్నారు.