ఆఖరి మజిలీకి ఎన్ని అవస్థలు

ASR: గిరిజన ప్రాంతాల్లో సరైన రహదారులు, వంతెన సౌకర్యాలు లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. డుంబ్రిగుడ మండలం చంపపట్టి గ్రామ యువకుడు కిలో మలేష్ (18) అనారోగ్యంతో సోమవారం స్థానిక పీహెచ్సీలో మృతి చెందాడు. భారీ వర్షాల కారణంగా చంపపట్టి గ్రామానికి వంతెన సౌకర్యం లేకపోవడం వల్ల మృతదేహాన్ని కుటుంబ సభ్యులు తమ భుజాలపై మోసుకొని గ్రామానికి తీసుకెళ్లాల్సి వచ్చింది.