VIDEO: పంటలు కొనుగోలు చేయాలని రోడ్డెక్కిన రైతులు
ADB: సోయా మొక్కజొన్న పంటలు కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ బోథ్ మండల రైతులు రోడ్డెక్కారు. స్థానిక కోరమాండల్ వద్ద నిర్మల్ రహదారిపై వందల సంఖ్యలో రైతులు ధర్నా చేపట్టారు. రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తామని బీరాలు పలికిన నాయకులు అరకొర పంటలు కొనుగోలు చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. వెంటనే పంటల కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు.