వాకింగ్ ట్రాక్‌ను ప్రారంభించిన మేయర్
ఖమ్మం నగరంలో ఇవాళ మేయర్ పునుకొల్లు నీరజ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె పెవిలియన్ మైదానంలో నిర్మించిన వాకింగ్ ట్రాక్, విశ్రాంతి గదిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పాదచారులు తయారుచేసిన ఉగాది పచ్చడిని అందరికీ పంపిణీ చేశారు. అనంతరం ఉగాది పండుగ విశిష్టత, పచ్చడి ప్రాముఖ్యతు వివరించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.