లేబర్ కోడ్స్ తీసుకురావడం దారుణం: ప్రసాద్

NLR: కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ రద్దు కోసం జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నామని సీఐటీయు జిల్లా అధ్యక్షులు ప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఇందుకూరుపేట మండలంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం ప్రధాని మోదీ లేబర్ కోడ్స్ తీసుకురావడం దారుణం అన్నారు. వెంటనే వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.