జిల్లాలో 15న ప్రత్యేక లోక్ అదాలత్
BHNG: జిల్లాలో ఈ నెల 15న ప్రత్యేక లోక్ అదాలత్‌ను నిర్వహించనున్నారని రామన్నపేట ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఎస్.శిరీష తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కక్షిదారులు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఈ మేరకు రామన్నపేట సర్కిల్ పరిధిలోని పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.