జిల్లాను కలవరపెడుతున్న 'స్క్రబ్ టైఫస్'
VSP: 'స్క్రబ్ టైఫస్' వ్యాధి జిల్లాలో కలకలం సృష్టిస్తోంది. జ్వరం, వాంతులు, అలసట, దగ్గు దీని ముఖ్య లక్షణాలు. జ్వరం తగ్గకపోతే తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నల్లిని పోలిన కీటకం కుట్టడం ద్వారా ఈ వ్యాధి వేగంగా వ్యాపిస్తుంది. అప్రమత్తంగా ఉండటం, సకాలంలో చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం.