విద్యుత్ షాక్‌తో పెయింటర్ మృతి
ప్రకాశం: పొదిలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ వీధిలో విషాదం చోటుచేసుకుంది. ఇంటికి పెయింట్ వేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో పెయింటర్ బుచిరాజు నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక తాలూకా కార్యాలయ వీధికి చెందిన నాగరాజును షాక్ తగిలిన వెంటనే 108 ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.