'ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని కలిసిన కలెక్టర్'

ADB: జిల్లా కేంద్రానికి వచ్చిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పట్టణంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందజేసి సాదర స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు. పోలీస్ పేరేడ్ గ్రౌండ్‌లో శుక్రవారం నిర్వహించనున్న స్వతంత్య్ర దినోత్సవ వేడుకల్లో షబ్బీర్ అలీ పాల్గొననున్నారు.