నేడు అయోధ్యలో శ్రీరామ రక్షా యంత్ర ప్రతిష్ఠాపన
చైత్ర నవరాత్రి పర్వదినం, ఉగాది సందర్భంగా అయోధ్య రామ మందిరంలో ఇవాళ 'శ్రీరామ రక్షా యంత్రం' ప్రతిష్ఠాపన జరగనుంది. ఈ చారిత్రక ఘట్టానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వయంగా హాజరవుతున్నారు. దైవిక రక్షణకు, ఆధ్యాత్మిక శక్తికి చిహ్నంగా భావించే ఈ యంత్రాన్ని స్థాపించడం ద్వారా సనాతన సంప్రదాయాలను పరిరక్షించే దిశగా మరో అడుగు పడనుంది. దీంతో అయోధ్యలో భక్తుల కోలాహలం నెలకొంది.