విద్యుత్ షాక్‌తో మహిళ మృతి

విద్యుత్ షాక్‌తో మహిళ మృతి

SRCL: ఇల్లంతకుంట మండలంలోని దాచారం గ్రామానికి చెందిన కరికవేణి లక్ష్మి(35) శుక్రవారం విద్యుత్ షాక్‌తో మృతి చెందింది. ఎస్సై అశోక్ కథనం ప్రకారం.. లక్ష్మి ఇంటి వద్ద స్విచ్ బోర్డులో ప్లగ్ పెడుతున్న క్రమంలో విద్యుత్ షాక్‌కు గురయ్యారు. దీంతో అక్కడే పడిపోయిన లక్ష్మిని హుటాహుటిన సిరిసిల్ల ఆసుపత్రికి తరలించాగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.