అంగన్వాడీ టీచర్లకు 5G స్మార్ట్ ఫోన్ల పంపిణీ
NTR: అంగన్‌వాడీ కేంద్రాల డిజిటలైజేషన్‌లో భాగంగా బుధవారం కాకాని నగర్‌లో ICDS ఆధ్వర్యంలో టీచర్లకు 5G స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, మున్సిపల్ ఛైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి ముఖ్య అతిథులుగా హాజరై వీటిని అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మరియు ఐసీడీఎస్ అధికారులు పాల్గొన్నారు.