ప్రారంభమైన అర్బన్ బ్యాంక్ ఎన్నికల పోలింగ్
KNR: కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైంది. ఉదయం నుంచే ఓటర్లు పెద్దఎత్తున ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కరీంనగర్, జగిత్యాలలో అధికారులు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల వరకు 16 శాతం ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారి తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం కౌంటింగ్ ప్రారంభం కానుంది.