2038 నాటికి భారత్ నెంబర్-1 అవుతుంది: CBN

AP: 2038 నాటికి భారతదేశం నెంబర్-1 అవుతుందని CM చంద్రబాబు అన్నారు. ఇందులో తెలుగు వారి పాత్ర ప్రధానంగా ఉండాలన్నారు. సూపర్ 6 ద్వారా సంక్షేమం చేస్తున్నామన్నారు. అభివృద్ధికి అదే తరహాలో నిధులిస్తున్నామని చెప్పారు. రాజకీయాలు ముఖ్యమే కానీ.. సమాజం గురించి కూడా ఆలోచించాలని పేర్కొన్నారు. రాజకీయాలే ఆలోచించి ఉంటే హైదరాబాద్ అభివృద్ధి జరిగేది కాదు.. విద్యుత్ సంస్కరణలు వచ్చేవి కావన్నారు.