ప్రజా పాలనలో ప్రజలకు సహాయం అందుతుంది: ఎమ్మెల్యే

BDK: భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం మండలానికి సంబంధించిన 42 కుటుంబాలకు సోమవారం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ప్రజా పాలనలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు దరఖాస్తు చేసిన రెండు నెలల్లో లబ్ధిదారులకు సహాయం అందజేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.