పేకాట ఆడుతున్న ఐదుగురు అరెస్ట్

పేకాట ఆడుతున్న ఐదుగురు అరెస్ట్

NLR: కందుకూరు పట్టణంలోని కోటారెడ్డి నగర్లో గుట్టుగా నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై టౌన్ పోలీసులు గురువారం దాడి చేశారు. ఈ ఘటనలో ఐదుగురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ. 6130 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై శివ నాగేశ్వరరావు తెలిపారు. పట్టణ పరిధిలో అసాంఘిక కార్యక్రమాలపై సమాచారం అందించాలని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.