తొర్రూరులో పీజీ కళాశాల ఏర్పాటు చేయాలి: SFI
MHBD:జిల్లాలోని రెండవ అతిపెద్ద డివిజన్ కేంద్రమైన తొర్రూరులో పీజీ కళాశాల లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని SFI జిల్లా కార్యదర్శి మధు ఆవేదన వ్యక్తం చేశారు. తొర్రూరులో ఇవాళ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తక్షణం పీజీ కళాశాల ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ డిగ్రీ కళాశాల రహదారికి సీసీ రోడ్లు వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో SFI నేతలు పాల్గొన్నారు.