రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
KNR: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జమ్మికుంట మండలంలో చోటుచేసుకుంది. తనుగుల గ్రామానికి చెందిన జక్కే రజినీకాంత్ (29) ట్రాక్టర్ నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. తండ్రి చిన్నతనంలో మరణించగా ట్రాక్టర్ నడుపుతూ కుటుంబపోషణ చేస్తున్నాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ కోసం చేసిన అప్పులు తీరక మనస్తాపానికి గురైన రజినీకాంత్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.