గూడూరులో పోలీసుల ముమ్మర తనిఖీలు

TPT: గూడూరు రూరల్ పోలీసులు ఆదివారం ఉదయం ముమ్మర తనిఖీలు చేపట్టారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని టిట్కోనివాసాల్లో పలు ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. కొత్తగా చేరిన వారి వివరాలను నమోదు చేశారు. అలాగే సరైన పత్రాలు లేని 50 ద్విచక్ర వాహనాలు 4 టూ వీలర్లను సీజ్ చేసినట్టు ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు. అలాగే మత్తు పదార్థాలు గాంజా వంటి వాటిపై సోదాలు నిర్వహించారు.