ఫీజు బకాయిలను విడుదల చేయాలని నిరసన

ఫీజు బకాయిలను విడుదల చేయాలని నిరసన

WGL: నర్సంపేటలోని అమరవీరుల స్తూపం వద్ద ప్రైవేట్ డిగ్రీ కళాశాల అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ.. ప్రైవేట్ డిగ్రీ కళాశాల యాజమాన్యాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని అన్నారు. డిగ్రీ కళాశాలకు రావాల్సిన రూ. 800 కోట్ల రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేసి విద్యార్థులు ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.