VIDEO: బావిలో పడి వ్యక్తి మృతి

VIDEO: బావిలో పడి వ్యక్తి మృతి

MHBD: ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మానుకోట పట్టణ శివారులో శుక్రవారం ఉదయం జరిగింది. బగ్గు తండాలో గల బావిలో బానోతు శీను అనే వ్యక్తి ప్రమాదవశాత్తు పడ్డాడు. ఈ క్రమంలో అతను బావిలోనే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. స్థానికుల సహాయంతో మృతదేహాన్ని బావిలో నుంచి వెలికితీశారు.