VIDEO: CC రోడ్డు వేసిన ఐదు రోజులకే పగుళ్లు..!

VIDEO: CC రోడ్డు వేసిన ఐదు రోజులకే పగుళ్లు..!

MLG: ఏటూరునాగారం పట్టణంలోని 1వ వార్డులో రూ. 2.50 కోట్లతో మంజూరైన CC రోడ్డు పనుల నాణ్యతపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు వేసిన ఐదు రోజులకే పగుళ్లు రావడంతో పనుల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.