చప్పడి గ్రామానికి త్రాగునీటి ఎద్దడి
ASR: అనంతగిరి మండలం చప్పడి గ్రామంలో గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాలతో గెడ్డలు, వాగులు ఉప్పొంగి గ్రావిటీ పైపులైన్లు కొట్టుకుపోయాయి. దీంతో త్రాగునీటి సంక్షోభం నెలకొంది. సమస్యను ఎదుర్కొంటూ గ్రామ యువత స్వయంగా కటిక జలపాతం వద్ద పైపులైన్ మరమ్మతులు చేపట్టారు. తరచూ త్రాగునీటి ఇబ్బందులు వస్తున్నాయన్నారు. అధికారులు శాశ్వత పరిష్కరించాలంటున్నారు.