ఉపాధి హామీ పనుల్లో అవినీతి

KMM: నేలకొండపల్లి మండలం పరిధిలో 32 గ్రామాలు ఉండగా ఏ గ్రామము చూసినా ఉపాధి హామీ పనుల్లో అవినీతిలో కూరుకుపోయింది. ఉపాధి హామీ తనిఖీలో జర్నలిస్టులు ప్రశ్నిస్తే మీపై కేసు నమోదు చేసి మిమ్మల్ని జైలుకు పంపుతామంటూ అధికారులు అంటున్నారని జర్నలిస్టులు తెలిపారు. ఈ విషయంపై పోలీసులు విచారించగా.. మా విధులకు ఆటంకం కలిగిస్తున్నారంటూ బయటికి పంపించారని జర్నలిస్టులు పేర్కొన్నారు.