కొండవాలు ప్రాంతంలో కార్పొరేటర్ పర్యటన

VSP: విశాఖ జీవీఎంసీ 48వ వార్డులోని ఇందిరానగర్-5లో కొండచరియలు విరిగి ఓ ఇంటి మేడపై పడ్డాయి. శుక్రవారం విషయం తెలుసుకున్న కార్పొరేటర్ గంకల కవిత అప్పారావు యాదవ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో కొండ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.