జగన్ బాధ్యతాయుతంగా మాట్లాడాలి: కొలికపూడి
AP: రాజధానిపై ఇక రాజకీయాలు ఆపాలని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సూచించారు. మావిగాన్ పేరుతో గందరగోళం సృష్టించొద్దన్నారు. అమరావతికి గతంలోనే జగన్ మద్దతు ఇచ్చారని తెలిపారు. మాజీ సీఎం బాధ్యతాయుతంగా మాట్లాడాలని హితవు పలికారు. బడ్జెట్ సమావేశాలను బహిష్కరించడం ఎందుకు అని ప్రశ్నించారు.