లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
JGL: జగిత్యాల రూరల్, అర్బన్ మండలాలకు చెందిన 10 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి పథకం కింద రూ.10 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ శుక్రవారం పంపిణీ చేశారు. పేద ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మీ పథకం వరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నందయ్య, తదితరులు పాల్గొన్నారు.