ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఛైర్మన్‌గా ఫణి కుమార్

NLR: అల్లూరు మండలంలోని ఇందుపూరు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఛైర్మన్‌గా ఫణి కుమార్ రెడ్డి నియామకమయ్యారు. సోమవారం దేవస్థానం ఆలయ ప్రాంగణంలో ఛైర్మన్‌గా ఆయన ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సేవలు అందించాలని తెలియజేశారు.