ఉయ్యూరు వీరమ్మ తల్లి శాపాలు ఇవే.!
కృష్ణా: ఉయ్యూరు వీరమ్మ తల్లి భర్త మరణ వార్త విన్న వెంటనే తీవ్రంగా తల్లడిల్లిపోయి సతీ సహగమనం చేయాలని నిర్ణయించుకుంది. భర్త హత్యకు కారణమైన సుబ్బయ్య వంశం నిర్వంశం కావాలని శపించగా, కొద్ది రోజుల్లోనే అతడు అకస్మాత్తుగా మృతిచెంది కుటుంబం అంతరించిందని గ్రామస్తులు చెబుతున్నారు. అనంతరం మళ్లీ వివాహానికి ఒత్తిడి చేసిన పుట్టినింటివారినీ ఆమె శపించిందన్న ప్రచారం ఉంది.