చేపల చెరువులకు బహిరంగ వేలం
CTR: సదుం మండలంలోని మొరవపల్లె పంచాయతీ పరిధిలో చేపల చెరువులకు ఇవాళ బహిరంగ వేలం నిర్వహించినట్లు ఎంపీడీవో రాధారాణి తెలిపారు. నేరేళ్ల చెరువు, గంటావాని చెరువు,చీకలచెరువులో చేపల పెంపకానికి వేలం నిర్వహించామని ఆమె చెప్పారు. నేరేళ్ల చెరువుకు రూ.11, 600, చీకలచెరువు రూ. 20,100, గంటావాని చెరువుకు రూ.14,010 హెచ్చు పాట పలకగా మొత్తం రూ. 45,710 ఆదాయం వచ్చిందన్నారు.