ఆమనగల్లులో ఐకేపీ కేంద్రం ప్రారంభం
NLG: వేములపల్లి మండలం అమనగల్లులో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఐకేపీ కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని డీటీసీఎస్ సైదులు సూచించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, నేరుగా ధాన్యాన్ని ఐకేపీ సెంటర్లో అమ్మి ప్రభుత్వం అందించే గిట్టుబాటు ధరను పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం జానకీ, సీసీ పిచ్చమ్మ, కుంచం నాగమణి, బంటు జ్యోతి పాల్గొన్నారు.