గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన షబ్బీర్​అలీ

గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన షబ్బీర్​అలీ

NZB: వినాయక నిమజ్జనానికి సంబంధించి జిల్లా కేంద్రంలో ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ఈ మేరకు గణేష్​ ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లను గురువారం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీ పరిశీలించారు. వివిధ శాఖల అధికారులతో కలిసి నగరంలోని వినాయక్​ నగర్​లో ఉన్న గణేష్ నిమజ్జన బావిని పరిశీలించారు. బావి ప్రాంతంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు.