ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సావిత్రిబాయి మహిళలు చదువుకోవడానికి మొదటిగా ఉపాధ్యాయురాలుగా మారి విద్యాబుద్ధులు నేర్పించి ఎంతో మందిని ఉన్నత శిఖరాలకు తీసుకువచ్చారని గుర్తు చేశారు