గోపాలపట్నంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

గోపాలపట్నంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

VSP: గోపాలపట్నం 89వ వార్డు ఎల్లపువానిపాలెం శ్రీ రామా అయ్యప్ప సేవా సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి సందడి ప్రారంభమైంది. ఆదివారం రామాలయం ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో గ్రామ ప్రజలకు 400 మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు. ప్రతి ఇంటిలో గణనాథుడిని ప్రతిష్ఠించి సంప్రదాయబద్ధంగా పూజలు చేసుకోవాలని పిలుపునిచ్చారు.