తుళ్లూరులో జనసేన నాయకుల వినూత్న కార్యక్రమం

తుళ్లూరులో జనసేన నాయకుల వినూత్న కార్యక్రమం

GNTR: స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో భాగంగా తుళ్లూరు మండలంలో శనివారం జనసేన నాయకులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శంకరరావు ఆధ్వర్యంలో మండలంలోని టీ దుకాణాల్లో ప్లాస్టిక్ గ్లాసులు వాడకుండా గాజు గ్లాసులను వాడాలని సూచించారు. అనంతరం టీ దుకాణాల యజమానులకు గాజు గ్లాసులను అందజేశారు. కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు.