రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన ఎస్సై

ప్రకాశం: కొండపి మండలంలోని నేర చరిత్ర కలిగిన వారిని ఎస్సై ప్రేమ్ కుమార్ తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ప్రస్తుత జీవన విధానాన్ని, చేస్తున్న వృత్తులను అడిగి తెలుసుకున్నారు. వివాదాలకు, తగాదాలకు పోవద్దని సూచించారు. లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.