హైవే పై రోడ్డు భద్రత అవగాహన
SRD: నిజాంపేట గ్రామంలోని హైవే రోడ్డులో IMS బృందం గురువారం రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు కరపత్రాలను పంపిణి చేశారు. కంట్రోల్ రూమ్, హైవే పెట్రోలింగ్, అంబులెన్స్ బృందం ట్రాఫిక్, రోడ్డు భద్రత ప్రాముఖ్యతపై వివరించారు. పాదచారులు రోడ్డుకు ఎడమవైపు నడవాలని, మద్యం సేవించి హైవేపైకి రాకూడదన్నారు. పశువులను రోడ్డు పక్కన వదిలి వేయరాదన్నారు.