ఆ ఉపగ్రహ చిత్రాలను ప్రచురించొద్దు: అమెరికా

ఆ ఉపగ్రహ చిత్రాలను ప్రచురించొద్దు: అమెరికా

ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో, పశ్చిమాసియాలోని కొన్ని ప్రాంతాల ఉపగ్రహ చిత్రాలను ప్రచురించొద్దని అమెరికా ప్రభుత్వం ప్రముఖ శాటిలైట్ చిత్రాల సంస్థలకు సూచించింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల సమయంలో ఈ చిత్రాల ప్రాముఖ్యత మరింత పెరిగింది. దీంతో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మార్చి 9 తర్వాత తీసిన ఉపగ్రహ చిత్రాల ప్రచురణను నిలిపివేస్తున్నట్లు ప్లానెట్ ల్యాబ్స్ సంస్థ పేర్కొంది.