ఉస్మానియా.. మహిళల కోసం తొలిసారిగా రూ. 2 కోట్లు
HYD: తార్నాకలోని ఉస్మానియా యూనివర్సిటీలో మహిళల కోసం ప్రత్యేక వసతుల అభివృద్ధికి తొలిసారిగా రూ. రెండు కోట్లను అధికారులు కేటాయించారు. ఈ నిధులతో హాస్టల్ సదుపాయాలు, శానిటేషన్, భద్రత చర్యలు మెరుగుపరుస్తారు. మహిళా విద్యార్థులు సురక్షితంగా చదువుకునే వాతావరణం కల్పించడమే లక్ష్యంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ నిర్ణయం మహిళా సాధికారతకు దోహద పడనుంది.