బియ్యం సరఫరాలో జాప్యం.. రేషన్ డీలర్ల ఆందోళన

బియ్యం సరఫరాలో జాప్యం.. రేషన్ డీలర్ల ఆందోళన

KNR: మూడు నెలల బియ్యం సరఫరాలో జాప్యం కారణంగా జిల్లాలో రేషన్ డీలర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరికి మాత్రమే కోటా కేటాయించడంతో మిగతా దుకాణాలపై ఒత్తిడి పెరిగిందని ఆరోపిస్తున్నారు. జిల్లాలో 546 దుకాణాలుండగా, 40 శాతానికి పైగా షాపులకు ఒక్కసారి మాత్రమే సరఫరా జరిగిందని తెలిపారు. ఈ నెలాఖరు వరకే పంపిణీ పూర్తి చేయాల్సి ఉండగా, పలువురు డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.