ఇటుకలపల్లి సర్కిల్ వద్ద రక్తదాన శిబిరం
ATP: పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇటుకలపల్లి సర్కిల్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. అనంతపురం జిల్లా పోలీస్, ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ సౌజన్యంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, స్థానికులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. అమరవీరుల సేవలను స్మరించుకున్నారు.