VIDEO: విద్యార్థులు మాల వేసుకున్నారని..?

VIDEO: విద్యార్థులు మాల వేసుకున్నారని..?

TG: జగిత్యాల(D) మెట్‌పల్లి నిఖిల్ భారత్ స్కూల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. హనుమాన్ మాల ధరించిన ఐదుగురు విద్యార్థులను పాఠశాల నిబంధనల పేరుతో యాజమాన్యం లోపలికి అనుమతించలేదు. దీంతో స్వాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. 21 రోజుల పాటు స్కూల్‌కు రావద్దని విద్యార్థులకు చెప్పడంతో పాఠశాల ఎదుట భక్తులు భారీగా చేరి నిరసన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు.