కాకినాడ ఎస్పీ గ్రీవెన్స్‌కు 24 అర్జీలు

కాకినాడ ఎస్పీ గ్రీవెన్స్‌కు 24 అర్జీలు

కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ (పీజీఆర్ఎస్)లో మొత్తం 24 అర్జీలు వచ్చాయి. ఇందులో కుటుంబ కలహాలపై 9, భూ తగాదాలపై 7, ఇతర సమస్యలపై 8 ఫిర్యాదులు ఉన్నాయి. ఈ అర్జీలను పరిశీలించి ఏడు రోజుల్లోగా బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ, అధికారులను ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించరాదని ఆయన స్పష్టం చేశారు.