విద్యార్థినిలకు సెల్ఫ్ డిఫెన్స్‌పై శిక్షణ

విద్యార్థినిలకు సెల్ఫ్ డిఫెన్స్‌పై శిక్షణ

AKP: మాకవరపాలెం మండలం బీమబోయినపాలెం కేజీబీవీ పాఠశాలలో రూరల్ సీఐ రేవతమ్మ ఆధ్వర్యంలో ఇవాళ బాలికలకు స్వీయ రక్షణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. శక్తి టీమ్స్‌తో కలిసి విద్యార్థినిలకు సెల్ఫ్ డిఫెన్స్‌పై శిక్షణ ఇస్తున్నామన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు పురస్కరించుకుని అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.