కారు, బైక్ ఢీ.. ఒకరు మృతి
E.G: గోకవరం మండలం కొత్తపల్లి గ్రామంలో పెట్రోల్ బంకు సమీపంలో శుక్రవారం కారు, బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో వ్యక్తి మృతి చెందాడు. మృతుడు జగ్గంపేట మండలం గోవిందపురంలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నట్లు సమాచారం. కాగా, భార్యభర్తలు ఇరువురు బైక్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భర్త చనిపోగా భార్యకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు.