కనువిందు చేస్తున్న డిండి ప్రాజెక్టు

NLG: డిండి ప్రాజెక్టు పూర్తిగా నిండి అలుగు పోస్తుందని ఇరిగేషన్ ఏఈ పరమేష్ శుక్రవారం తెలిపారు. దుందుభి వాగు నుంచి 4200 క్యూసెక్కుల వరద వస్తుందన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి 36 అడుగులు కాగా, పూర్తిగా నిండిందని తెలిపారు. తెల్లటి పాలనురుగల్లాగా అలుగు పోస్తూ పర్యాటకులకు కనువిందు చేస్తుంది. శ్రీశైలం హైవేపై ఉండడంతో పర్యాటకుల తాకిడి పెరిగిందని పేర్కొన్నారు.