పత్తి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఎస్సై
BDK: జూలూరుపాడు మండల కేంద్రంలోని పత్తి కొనుగోలు కేంద్రాన్ని సోమవారం మండల ఎస్సై బాదావత్ రవి పరిశీలించారు. వాహనదారులు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పత్తి కొనుగోలు చేపట్టాలని అన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రధాన రహదారిపై కొనుగోలు వాహనాలు నిలపకుండా చూడాలని వ్యాపారులకు సూచించారు.